కొమురం భీంకు మహేష్ కుమార్ గౌడ్ ఘన నివాళులు

కొమురం భీంకు మహేష్ కుమార్ గౌడ్ ఘన నివాళులు

 

నిజామాబాద్, వెలుతురు, అక్టోబర్ 22 :

 

ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ‘జల్‌–జంగల్‌–జమీన్‌’ నినాదంతో పోరాడిన తెలంగాణ వీరుడు కొమురం భీం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. కొమురం భీం జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం భీం సాగించిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆదివాసీల భూమి, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కొమురం భీం త్యాగం, ధైర్యం, పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.