దత్తన్న అలయ్ బలయ్ ఎంతో ప్రత్యేకం

దత్తన్న అలయ్ బలయ్ ఎంతో ప్రత్యేకం

 

హైదరాబాద్‌, వెలుతురు , అక్టోబర్ 22 : తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. దత్తన్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు కీలక పాత్ర పోషించారని, అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉన్నప్పటికీ, అనంతరం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొస్తున్న బండారు దత్తాత్రేయ, విజయలక్ష్మిలకు ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.