కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు కొండపోచమ్మ సాగర్‌ నీళ్ల మళ్లింపుపై విచారణ జరపాలి

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు కొండపోచమ్మ సాగర్‌ నీళ్ల మళ్లింపుపై విచారణ జరపాలి

 

ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శికి లేఖ రాసిన ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

 

హైదరాబాద్‌, వెలుతురు,  అక్టోబర్ 22: కొండపోచమ్మ సాగర్‌ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటిని మళ్లించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శి శ్రీధర్‌కు ఆయన లేఖ రాశారు. ప్రజల అవసరాల కోసం ఉద్దేశించిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం నీటిని వ్యక్తిగత అవసరాలకు వినియోగించారన్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరారు.

 

కొండపోచమ్మ సాగర్‌ నుంచి పాండురంగ చెరువుకు, అక్కడి నుంచి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటిని తరలించిన తీరుపై ప్రాజెక్టు రికార్డులను పరిశీలించాలని ఎంపీ కోరారు. ఈ వ్యవహారంలో ప్రజాధనం ఎంత మేరకు వినియోగమైందో తేల్చాలని, విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.