శ్రీమన్నారాయణుడిని దర్శించుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి, వెలుతురు, అక్టోబర్ 24 : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ వైకుంఠపురంలోని శ్రీమన్నారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీమన్నారాయణ స్వామివారిని ప్రార్థించారు.
