ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడంటే?
హైదరాబాద్ వెలుతురు అక్టోబర్ 26: తెలంగాణలో వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను డిసెంబర్ చివరిలో లేదా జనవరి మొదటి వారంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు మూడు కార్పొరేషన్ల ఎన్నికలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నవంబర్ 9న ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి కసరత్తు చేస్తోంది. అలాగే ఎన్నికల కోడ్ రాకముందే ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
