ఈగల్ ఫోర్స్ సోదాలు.. 65 మందికి డ్రగ్స్

ఈగల్ ఫోర్స్ సోదాలు.. 65 మందికి డ్రగ్స్

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 26 :  ఫతేనగర్ లో గంజాయి విక్రయాలపై ఈగల్ ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించాయి. ఎల్బీఎస్ నగర్ లోని ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించి.. 75 ఏళ్ల షేక్ జతేన్ బీ అనే మహిళను అరెస్టు చేశారు. ఆమె ఇంట్లోని 179.1 గ్రాముల గంజాయి, రూ.43,340 నగదు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కొనుగోలు కోసం 70 మంది వచ్చినట్లు గుర్తించి పరీక్షలు నిర్వహించగా.. 65 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారిని డీ- అడిక్షన్ సెంటర్కు తరలించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితురాలిపై గతంలోనూ గంజాయి సంబంధిత ఏడు కేసులు నమోదైనట్లు గుర్తించారు. మరో ఐదుగురు అనుమానితులు మున్నీ బేగం, ఇమ్రాన్, హనీఫా బీ, ఖాజా బీ, ఖాజా పాషా కోసం ఈగల్ పోలీసులు గాలిస్తున్నారు. గంజాయి సరఫరా మూలాలు, నెట్వర్క్ పై దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.