కేటీఆర్‌పై బాల్మూర్ వెంకట్ తీవ్ర ఆరోపణలు

కేటీఆర్‌పై బాల్మూర్ వెంకట్ తీవ్ర ఆరోపణలు

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 26 :  కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసమే నిర్మించి తెలంగాణ ప్రజలను కరువులోకి నెట్టింది కల్వకుంట్ల కుటుంబమేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ బాల్మూర్ వెంకట్ ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంపై ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు వివరిస్తుంటే బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లపై అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎల్లుండి జరిగే ఎల్‌నినో అఖిలపక్ష సమావేశానికి కేసీఆర్‌ను తీసుకురావాలని సవాల్ విసిరారు. మరోవైపు కేటీఆర్ వ్యక్తిగత వ్యవహారాలపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వేధింపులతో పలువురు మహిళలు హైదరాబాద్ విడిచి వెళ్లిపోయారని ఆరోపించారు. గతంలో మారుపేర్లతో విదేశీ పర్యటనలు చేశారని, తన ఆరోపణలను ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని బాల్మూర్ వెంకట్ ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.