దీపావళి అనంతరం హైదరాబాద్ లో పారిశుధ్య డ్రైవ్

దీపావళి అనంతరం హైదరాబాద్ లో పారిశుధ్య డ్రైవ్

హైదరాబాద్‌, వెలుతురు, నవంబర్ 09 : దీపావళి వేడుకల అనంతరం రోడ్లు, కాలనీలు, బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన బాణసంచా వ్యర్థాల తొలగింపునకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా సర్కిల్‌-38 పరిధిలోని యూసుఫ్‌గూడ, ఏజీ కాలనీ, వెంకట్రావునగర్‌ ప్రాంతాల్లో పారిశుధ్య సిబ్బంది విస్తృతంగా శుభ్రత పనులు చేపట్టారు. బాణసంచా కాల్చిన తర్వాత మిగిలిన కాగితాలు, అట్టముక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలతోపాటు ఇతర చెత్తను తొలగించారు. రోడ్ల పక్కన, కూడళ్లు, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సేకరించి సక్రమంగా తరలించారు. పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా పండుగ వ్యర్థాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే పారవేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.