టీటీడీ జేఈవోగా ప్రభల గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ

తిరుపతి, తిరుమల, వెలుతురు, ఆగష్టు 10:

టీటీడీ నూతన జేఈవో (విద్య & వైద్య) గా నియమితులైన ప్రభల గోపీనాథ్ సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.