ఎల్లూరి శ్రీనివాస్ సేవలు ఎనలేనివి : డా. ఎస్.ఎం. హుస్సేని ముజీబ్

హైదరాబాద్ : హైదరాబాద్ గృహకల్పలోని గెజిటెడ్ యూనియన్ భవన్‌లో టి.ఎన్.జి.ఓస్ యూనియన్ హైదరాబాద్ అధ్యక్షులు ఎల్లూరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను యూనియన్ నాయకులు, ఉద్యోగులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టి.ఎన్.జి.ఓస్ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్.ఎం. హుస్సేని ముజీబ్, ఎల్లూరి శ్రీనివాస్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీ పూలదండ, పుష్పగుచ్ఛంతో సత్కరించి స్వీట్లు తినిపించారు. డా. ఎస్.ఎం. హుస్సేని ముజీబ్ మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం, టి.ఎన్.జి.ఓస్ యూనియన్ బలోపేతం కోసం ఎల్లూరి శ్రీనివాస్ చేస్తున్న సేవలను అభినందించారు. ఉద్యోగుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో, హక్కుల పరిరక్షణలో ఆయన ముందుంటారని తెలిపారు. సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించి, ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, వేతన సవరణ అంశాల్లో కీలకంగా కృషి చేశారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఉద్యోగుల సంక్షేమం కోసం మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ, ఎల్లూరి శ్రీనివాస్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, నిండు నూరేళ్ల ఆయుష్షు కలగాలని డా. ఎస్.ఎం. హుస్సేని ముజీబ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టి.ఎన్.జి.ఓస్ యూనియన్ సహాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, వెంకటేష్, హైదరాబాద్ నగర అధ్యక్షులు శ్రీకాంత్, నగర కార్యదర్శి కురాడి శ్రీనివాస్, సహాధ్యక్షులు కె.ఆర్. రాజ్‌కుమార్, ప్రచార కార్యదర్శి వైదిక్ శాస్త్ర, కార్యవర్గ సభ్యులు ముకీద్ ఖురేషి, సహాయ ప్రచార కార్యదర్శి వహీద్, విజయ్, రోహిత్, కృష్ణ, పరమేష్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు, ఉద్యోగులతో కలిసి ఎల్లూరి శ్రీనివాస్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.