- వీబీజీ రామ్ జీ తో కేంద్రానికి పేరుస్తుందని కాంగ్రెస్ కు అక్కసు
- రాష్ట్రానికి భారమనుకుంటే ప్రధానితో మాట్లాడి ఒప్పించండి
- పేదలకు మంచి జరుగుతుంటే కోర్టుకు వెళ్లడం దుర్మార్గం
- పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ సరే… 10 వేల స్కూళ్ల మూసివేత యోచన దుర్మార్గం
- బిగ్ బాస్ షో ను తలపిస్తోన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు
- సింగరేణి బొగ్గు మాయంపై విచారణ చేసే దమ్ము లేదా?
- చేతగాదని లేఖ రాస్తే విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్దం
- పొన్నం వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం…
- కరీంనగర్ ను మరిన్ని నిధులు తెస్తా… అభివ్రుద్ధి చేస్తా
- డంపింగ్ యార్డు వద్ద ఇకపై చెత్తను నిల్వ లేకుండా చేస్తాం
- బీజేపీ ఎదుగుతోందనే భయంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్
- బిగ్ బాస్ షో ను తలపిస్తోన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు…
- బీజేపీ బలపడుతుంటే ఓర్వలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ తో అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నాయి
- ఫోన్ ట్యాపింగ్ బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
- బీజేపీ ఎదుగుతోందనే భయంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్
- కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్…
- కరీంనగర్ లో పలు అభివ్రుద్ది పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి
కరీంనగర్ వెలుతురు జూలై 03:
వీబీజీ రామ్ జీ పథకం ద్వారా పేదలకు ఎంతగానో మేలు జరగడంతోపాటు గ్రామాల్లో ఆస్తుల స్రుష్టి జరగబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ పథకాన్ని అమలు చేస్తే కేంద్రానికి మంచి పేరుస్తుందని అక్కసుతోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమమన్నారు. ఈ స్కీం అమలు రాష్ట్రానికి భారం అన్పిస్తే ప్రధానమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లాలే తప్ప కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలనుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, టీచర్లకు బ్రేక్ ఫాస్ట్, పాలు, లంచ్ సౌకర్యం కల్పించడాన్ని కేంద్ర మంత్రి స్వాగతించారు. ఒకవైపు బ్రేక్ పాస్ట్ సౌకర్యం కల్పిస్తూనే మరోవైపు రాష్ట్రంలో ఏకంగా 10 వేల స్కూళ్లను మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు. రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా పాఠశాలలను మూసివేయడం దుర్మార్గమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో బాధ్యులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ పిక్సింగ్ జరగడమే కారణమన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతోందని, చాపకింద నీరుగా బలపడుతుండటంతో ఓర్వలేకి కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతలు కుమ్కక్కై బిగ్ బాస్ షోను తలపించేలా డ్రామాలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు అవినీతి పార్టీలేనని, అందుకే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అందుకే తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలను ఎలిమినేషన్ చేసి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
శుక్రవారం రోజున కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ కేఏపీపీ చంద్ర(టింకు)తో కలిసి కరీంనగర్ లోని 37వ డివిజన్ లో రూ.77 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. షాషామహల్ ప్రాంతంలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌లోని 37వ డివిజన్ లో రూ.77 లక్షల మన్సిపల్ సాధారణ నిధులతో సీసీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని, 7వ డివిజన్ లో బీజేపీ గెలవదని చాలా మంది చెప్పారు, కానీ గెలిచి చూపించాం, ప్రజలు బీజేపీ అభ్యర్థి చంద్రను ఆశ్వీరించారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని సమస్యల్లేని డివిజన్ గా మారుస్తాం. మరో వారం రోజుల్లో రూ.50 కోట్ల యూడీఎఫ్ నిధులతో కరీంనగర్‌లో రోడ్ల నిర్మాణ పనులను కూడా ప్రారంభించబోతున్నాం. అలాగే మరో 3 నెలల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీం కింద కేంద్రం ఇచ్చిన రూ.840 కోట్ల నిధులతో కరీంనగర్‌ను సుందరంగా తీర్చిదిద్దే పనులను ప్రారంభించబోతున్నాం. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అందించిన 100 రోజుల్లోనే యూడీఎఫ్ నిధులను తీసుక వచ్చాను. అమ్రుత్ నిధులతో కరీంనగర్‌లో మంచి నీటి సమస్య లేకుండా చేస్తాం. రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో కరీంనగర్ ను అభివ్రుద్ధి చేస్తున్నానని, ఎంపీగా ఎన్నికైనప్పటి నుండి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ది కోసం రూ.22 వేల కోట్లు కేంద్రం నుండి తీసుక వచ్చానని తెలిపారు. దసరా నాటికి కరీంనగర్ వరంగల్ హైవే రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, అతి త్వరలో కరీంనగర్ జగిత్యాల హైవే పనులను, గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ అయిన గన్నేరువరం బ్రిడ్జి నిర్మాణ పనులకు సైతం అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
పొన్నం వ్యాఖ్యలకు బండి కౌంటర్
యూసీఎఫ్ నిధులపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని, దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్టులకు మాత్రమే యూసీఎఫ్ ఫండ్ ఇస్తే, కరీంనగర్ అందులో ఉందనే విషయం మర్చిపోతే ఎలా అని ప్రశ్నించాడు. యూసీఎఫ్ స్కీం కేంద్రానిదే అని పొన్నంకు చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులెందుకు ఇవ్వడం లేదో తెలపాలని, ఆరోపణులు కాకుండా నిధులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధికి సహకరించాలని కోరాడు.
