టీజీ సేఫ్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అవినాశ్ మహంతి

హైదరాబాద్ వెలుతురు ఆగస్టు 17:

ఆహారం, ఔషధాల నాణ్యత ప్రమాణాలను మరింత పటిష్ఠం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టాండర్డ్స్‌ అథారిటీ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ (టీజీ సేఫ్‌) కమిషనర్‌గా అవినాశ్‌ మహంతి సోమవారం డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ఆరు విభాగాలుగా టీజీ సేఫ్‌

డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం: డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ చట్టం-1940 ప్రకారం లైసెన్సింగ్‌, తనిఖీలు, శాంపిలింగ్‌, టెస్టింగ్‌, విచారణలను చేపడుతుంది.

లీగల్‌-ప్రాసిక్యూషన్‌ విభాగం: రెండు విభాగాలకు అవసరమైన చట్టపరమైన సలహాలు, కోర్టు కేసుల విచారణలో ప్రాసిక్యూషన్‌ మద్దతు అందిస్తుంది.

ఫుడ్‌ సేఫ్టీ విభాగం: ఫుడ్‌సేఫ్టీ యాక్ట్‌-2006 ప్రకారం లైసెన్సింగ్‌, రిజిస్ట్రేషన్‌, తనిఖీలు, చట్టం అమలును పర్యవేక్షిస్తుంది.

లేబొరేటరీ విభాగం: ఫుడ్‌ టెస్టింగ్‌, డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఈ విభాగం కిందకు వస్తాయి. దీని కింద రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పని చేస్తారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం: ఇంటెలిజెన్స్‌ సమాచారం సేకరించడం, ప్రమాదకరమైన ప్రదేశాల్లో తనిఖీలు చేయడం, కేసులు నమోదు చేయడంలో ఆహార, ఔషధ విభాగాలకు సహకరిస్తుంది. ప్రారంభంలో దీని కోసం పోలీసు శాఖ నుంచి సిబ్బందిని డిప్యుటేషన్‌పై కేటాయిస్తారు.

పరిపాలనా విభాగం: మానవ వనరులు, బడ్జెట్‌, ఖాతాలు, అడ్మినిస్ట్రేటివ్‌ అంశాలను చూసుకుంటుంది.

Leave A Reply

Your email address will not be published.