హైదరాబాద్ వెలుతురు ఆగస్టు 13:
పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ విచారణలో భాగంగా గురువారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లచే పదవి నుండి తొలగించబడిన సర్పంచులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిగింది. పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ చైర్మన్ సూదిని రామిరెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు నాగులూరి కృష్ణ కుమార్ గౌడ్, బూసా వేణుగోపాల్ యాదవ్ పాల్గొని అప్పీలుదారులు, ప్రతివాదుల తరఫు వాదనలు విన్నారు.
సర్పంచులు తమ పదవీకాలంలో ఎదుర్కొన్న అంశాలు, వారిపై వచ్చిన ఆరోపణలు, సంబంధిత అధికారుల ఆదేశాలు, అలాగే అప్పీళ్లలో పేర్కొన్న కారణాలను సమగ్రంగా పరిశీలిస్తూ విచారణ కొనసాగింది. ట్రిబ్యునల్ సభ్యులుగా, సంబంధిత రికార్డులు, ఆధారాలు, ఇరుపక్షాల వాదనలను నిష్పక్షపాతంగా పరిశీలించి, చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవడమే ట్రిబ్యునల్ ప్రధాన బాధ్యతని తెలిపారు.
