బ్రాహ్మణ సమాజ ఐక్యతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి: హార్కర వేణుగోపాల్ రావు

 

హైదరాబాద్ వెలుతురు జూలై 12:

హైదరాబాద్‌ మల్లాపూర్‌లోని వీఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వశిష్టా కల్యాణ వేదిక, రాజతోత్సవ వేడుకలు మరియు బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్ & పబ్లిక్ రిలేషన్స్) శ్రీ హార్కర వేణుగోపాల్ రావు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ శ్రీ బసవరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హార్కర వేణుగోపాల్ రావు మాట్లాడుతూ, బ్రాహ్మణ సమాజ ఐక్యతను బలోపేతం చేయడంలో, సనాతన ధర్మ సంప్రదాయాలను పరిరక్షించడంలో, యువతకు వివాహ పరిచయ వేదికలను అందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. సమాజంలోని ప్రతి వర్గం అభ్యున్నతికి పరస్పర సహకారం, సామాజిక బాధ్యత ఎంతో అవసరమని పేర్కొన్నారు.

తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించి, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్, బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు, పండితులు, వేదపండితులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బ్రాహ్మణ కుటుంబాలు, ప్రముఖులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.