చిన్న రైస్ మిల్లర్లను వేధించడం అన్యాయం: టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

  • చిన్న రైస్ మిల్లర్లను వేధించడం అన్యాయం ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఇవ్వాలి
  • రైతులతో పాటు చిన్న రైస్ మిల్లర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శ
  • పెద్ద రైస్ మిల్లర్లకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆరోపణ
  • చిన్న మిల్లర్లపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన
  • వేల కోట్ల సీఎంఆర్ బకాయిలు ఉన్న పెద్ద మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • చిన్న రైస్ మిల్లర్లకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి
  • టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్ వెలుతురు జూలై 15:

రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండగా, మరోవైపు చిన్న రైస్ మిల్లర్లను కూడా వేధిస్తోందని విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్న పెద్ద రైస్ మిల్లర్లను వదిలిపెట్టి, లక్షల రూపాయల లెవీ బకాయిలు ఉన్న చిన్న రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

వేల కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్) బకాయిలు ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న పెద్ద రైస్ మిల్లర్ల నుంచి వెంటనే బకాయిలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో చిన్న రైస్ మిల్లర్లకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) అవకాశం కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.