- పరీక్షకు హాజరైన విద్యార్థులు 193, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 176
- 25 మందికి పైగా విద్యార్థులకు ఎంబిబిఎస్, 70కి పైగా బి డి ఎస్, వెటర్నరీ, హోమియో, ఆయుర్వేదిక్, యూనానీ కోర్సుల్లో సీట్లు వచ్చే అవకాశం
- వైద్యవిద్యలో పెరిగిన బీసీల ప్రాధాన్యత
- బీసీ విద్యార్థుల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది
- బీసీ విద్యార్థులకు వైద్యవిద్య మరింత చేరువ – బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
హైదరాబాద్ వెలుతురు జూలై 17:
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( NEET) పరీక్ష ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. గత ఏడాది కంటే ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించడంతో పాటు 25 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ లో, 70 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు బీడీఎస్, వెటర్నరీ, హోమియో, ఆయుర్వేదిక్, యూనానీ కోర్సుల్లో సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది 193 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా వారిలో 176 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 165 మంది బాలికలు పరీక్ష రాయగా వారిలో 154 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. 28 మంది బాలురు పరీక్ష రాయగా 22 మంది అర్హత సాధించారు. గత ఏడాది కటాఫ్ మార్కులు బట్టి చూస్తే ఉత్తీర్ణత సాధించిన వారిలో 25 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ కోర్సుల్లో , 70 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు బీడీఎస్, వెటర్నరీ, హోమియో, ఆయుర్వేదిక్, యూనానీ కోర్సుల్లో సీటు వచ్చే అవకాశం ఉంది.
బి. హిమణి (490) జి. సుప్రియ (485) ఎం. శివాత్మిక (473), బి. కల్పిత (466) జి. హర్షిణి (450)కె. సాయి సోనిక (449), ఎం. గౌతమి (448), ఎస్. స్నిగ్ధ (432), పి. త్రిష (424), కె. శ్రావణ్ కుమార్ (417), జి. అక్షిత (414). ఎల్. శ్రియ (408), కె. స్వాతి (407), టి. ముత్తవ్వ (406), జి. కీర్తి (402) మార్కులు సాధించారు.
వైద్య విద్యా కోర్సులు అభ్యసించేందుకు పేద బీసీ విద్యార్థులు అర్ఙత సాధించడం ఆనందంగా ఉందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. పేదలకు వైద్య విద్యను చేరువ చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయం మేరకు మెరుగైన విద్యాను బీసీ గురుకుల విద్యార్థులకు అందిస్తున్నామని అన్నారు. గురుకుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామనడానికి ఈ ఫలితాలు ఉదాహారణ అన్నారు. అధ్యాపకులను, గురుకుల సిబ్బందిని ఆయన అభినందించారు.
పేదలకు ఉన్నత విద్యను చేరువచేయడంలో బీసీ గురుకుల విద్యాలయాలు భేష్ గా పనిచేస్తున్నాయని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వి. హనుమంతరావు గారు అన్నారు. వైద్య విద్యలో సీటు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. గురుకుల సిబ్బంది మరింత అంకిత భావంతో పనిచేయాలని ఆయన సూచించారు. విద్యార్థులను, అధ్యాపకులను బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి(ఎఫ్ ఎ సి), కమీషనర్ బాలమాయదేవి , బీసీ గురుకుల కార్యదర్శి బడుగు సైదులు, ఇతర అధికారులను అభినందించారు.
