ఆటో డ్రైవర్ భరత్‌కు కొత్త ఆటో కొనిచ్చిన బండి సంజయ్

 

కరీంనగర్ వెలుతురు జూలై 17:

వనపర్తి జిల్లాకు చెందిన చంచరి భరత్ కుమార్ (24) తన ఆటో వెనుక కవర్ పై ‘‘Changing your religion is like your father (నీ మతాన్ని మార్చుకోవడం అంటే నీ తండ్రిని మార్చుకోవడం లాంటిది), Anyone born on this earth is a hindu… jai Sriram (ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులే… జై శ్రీరామ్) అని నినాదాన్ని రాయించుకున్నారు. ఈనెల 13న భరత్ ప్యాసింజర్ ను ఎక్కించుకుని మెహిదీపట్నం నుండి జీడిమెట్లకు వెళుతుండగా మజ్లిస్ పార్టీకి చెందిన నలుగురు యువకులు ఆటోను వెంబడించారు. ‘ఆటో వెనుక ఏం రాసినవ్ రా… ఏమనుకుంటున్నవ్ రా…ఆ స్లోగన్స్ తీసేస్తావా? లేదా?’’ అంటూ బండ బూతులు ఆటో కవర్ వెనుకనున్న నినాదాలను గీకేశారు. ఆటో కవర్ ను చించి వేశారు. కొద్దిసేపటి తరువాత అత్తాపూర్ ఎస్ఐ శ్రీనివాసులు ఫోన్ చేసి ‘‘ఆటోమీద అట్లాంటి స్లోగన్స్ ఎట్లా రాస్తావ్? హైదరాబాద్ లో ఆటో తిరగాలని ఉందా? లేదా? వెంటనే స్టేషన్ కు రా. నీమీద కంప్లయింట్ వచ్చింది. రాకపోతే నీ ఆటోను సీజ్ చేస్తా’’అంటూ బెదిరించారు.

దీంతో భరత్ స్థానిక బీజేపీ నేతలను వెంట బెట్టుకుని రెండ్రోజుల క్రితం కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. ఫోటోలు, వీడియోలు చూపించారు. వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘‘బాధపడొద్దు. నేను అండగా ఉంటా’’అని భరోసా ఇవ్వడమే కాకుండా హిందుత్వ సిద్దాంతాన్ని నమ్మి ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నందుకు అభినందించారు. పాత ఆటో స్థానంలో కొత్త ఆటో ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు శుక్రవారం రోజున భరత్‌ను పిలిపించి కొత్త ఆటో ఇవ్వడంతోపాటు హిందుత్వ నినాదాలతోనున్న పాత ఆటోను స్వయంగా నడుపుకుంటూ దాదాపు 5 కి.మీలు ప్రయాణించాడు.

Leave A Reply

Your email address will not be published.