మునుగోడు , జూలై 17 (వెలుతురు):
మునుగోడు పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా శోభన్‌బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో గుండాల పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయన ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా మునుగోడుకు బదిలీ అయ్యారు.
ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు పరిరక్షించడానికి కృషి చేస్తానని, శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి ఫిర్యాదులు ఉన్న నేరుగా పోలీసు స్టేషన్ లో సంప్రదించాలన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, నేరాల నియంత్రణలో రాజీ ఉండదన్నారు. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్రజలు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని, నేరాల నియంత్రణలో పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్సై శోభన్‌బాబు విజ్ఞప్తి చేశారు.
