లండన్‌లో ఘనంగా కేటీఆర్‌ 50వ జన్మదిన వేడుకలు

లండన్‌, జూన్ 23 (వెలుతురు):

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 50వ పుట్టిన రోజు సందర్భంగా యూకే వ్యాప్తంగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు  అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్రియతమ నేత కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని యూకేలోని ఎన్నారైల తరపున కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . ఆయన భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు సమర్థ నాయకత్వం అందిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని   ఆకాంక్షించారు.

ఈ సందర్భాంగా బీఆర్ఎస్ లెస్టర్ పట్టణ ఇంచార్జ్ సాకేత్ రావు కాచవరపు ఆధ్వర్యంలో ‘ గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించినట్లు ఉపాధ్యక్షుడు రవి రేతినేని తెలిపారు. లండన్‌లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవపేట్ తెలిపారు.

సమాజానికి ఉపయోగపడే రకరకాల సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిచ్చే కేటీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రానున్న రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతామని ఉపాధ్యక్షుడు సత్య చిలుముల తెలిపారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సేవా కార్యక్రమాలు, వేడుకలను విజయవంతం చేసిన యూకే వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, సభ్యులందరికీ ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, ఐటీ, మీడియా & పీఆర్ కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల & గణేష్ కుప్పాల, అడ్వైజరీ బోర్డు సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర, గణేష్ పాస్తం, కోశాధికారి సురేష్ బుడగం, సెక్రటరీ మల్లా రెడ్డి, లండన్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి పింగలి, యూత్ వింగ్ కార్యదర్శి ప్రశాంత్ మామిడాల, మెంబర్​షిప్ కో ఆర్డినేటర్ అంజన్ రావు, యూత్ వింగ్ సెక్రటరీ పవన్ కుమార్ గౌడ్, నర్సింగ రావు, యూత్ వింగ్ కో ఆర్డినేటర్ అమరేశ్వరి బోయిని, మీడియా కో ఆర్డినేటర్ సాయి కిరణ్ రావు పేరాల, జనార్ధన్ దమ్మక్కపల్లి, హరికృష్ణ మామిళ్ల, అబ్దుల్ కుదుస్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్‌ (టాక్) సభ్యులు పవిత్ర రెడ్డి, సుప్రజ పులుసు, క్రాంతి రేటినేని పాల్గొన్నారు.

 

లండన్‌లోని థేమ్స్‌ నది టవర్‌ బ్రిడ్జ్‌ వద్ద ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే యువ నాయకుడు జైపాల్ రెడ్డి కేటీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ విన్నూతంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.