అలయ్ బలయ్ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆహ్వానం
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 15 :
ఈ నెల 22వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించనున్న దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మంత్రికి తెలియజేసి, వేడుకకు హాజరుకావాలని కోరారు.
