జూబ్లీహిల్స్–ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ మధ్య 6 లేన్ల ఫ్లైఓవర్
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 15 :
హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ₹1,090 కోట్లతో ప్రతిపాదించిన 4.3 కిలోమీటర్ల ఆరు లేన్ల స్టీల్ ఫ్లైఓవర్ కారిడార్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేబీఆర్ పార్క్ ప్రధాన ప్రవేశం, అగర్సేన్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద జంక్షన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే, ముగ్ధ జంక్షన్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ వరకు భూగర్భ పరిశోధనలు చేపట్టాలని, ఫ్లైఓవర్ పునాది పనులతో పాటు స్టీల్ ఫ్యాబ్రికేషన్ను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కారిడార్ పూర్తయితే ఆయా ప్రాంతాల్లో సిగ్నల్ రహిత ప్రయాణానికి మార్గం సుగమం కానుంది.
