ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 16: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సరస్వతి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి సచిన్ సావంత్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ నాయకుడు ఆడేం సంతోష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. విపత్తుల సమయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.