మెడికవర్ వ్యవహారంపై సీఎం సమాధానం చెప్పాలి: మన్నె క్రిశాంక్
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 16 : మెడికవర్ ఆసుపత్రి, మ్యాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ట్ సంస్థల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఈ సంస్థల్లో రేవంత్ రెడ్డి కుటుంబానికి సన్నిహితులుగా పేర్కొంటున్న వ్యక్తులకు ఉన్న షేర్ల వివరాలను వెల్లడిస్తూ, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మెడికవర్ ఆసుపత్రి రూ.13,200 కోట్లకు అమ్ముడైన వ్యవహారంపైనా సీఎం సమాధానం చెప్పాలని కోరారు. ఈ అంశాలపై ఆధారాలతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని క్రిశాంక్ పేర్కొన్నారు.
