రాయదుర్గం మున్నూరుకాపు సంఘం నూతన భవన ప్రారంభోత్సవం
గచ్చిబౌలి, వెలుతురు, అక్టోబర్ 16 : హైదరాబాద్ రాయదుర్గం మున్నూరుకాపు సంఘం ట్రస్ట్ కొత్తగా కట్టిన భవన సముదాయం ప్రారంభోత్సం శుక్రవారం ఉదయం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ నూతన పటేల్ భవన సముదాయం ప్రారంభోత్సం సందర్భంగా ఎంపీ రవిచంద్ర జ్యోతి ప్రజ్వలన గావించి,వేద పండితులు నిర్వహించిన గణపతి హోమం, శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.దేవీ నవరాత్రోత్సవాలు, విజయదశమి సందర్భంగా ఎంపీ రవిచంద్ర ట్రస్ట్ సభ్యులు, సంఘం కార్యవర్గం,బంధువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.భవన నిర్మాణానికి చేయూత నందించి,ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వద్దిరాజును శేరిలింగంపల్లి మునిసిపల్ మాజీ ఛైర్మన్,సంఘం ప్రముఖులు నర్సింగరావు ఆధ్వర్యంలో సభ్యులు శాలువాలతో సత్కరించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సర్థార్ పుటం పురుషోత్తమ రావు,ప్రముఖులు నాగం ఇందిర,నాగం స్వామి, రౌతు కనకయ్య,గాలి అనిల్ కుమార్,మరికల్ పోత సుధీర్ కుమార్,తూడి ప్రవీణ్,కొమిరిశెట్టి సాయిబాబా,సల్లా శ్రీనివాసరావు,బీరం శ్రీనివాస్,సల్లా కృష్ణ,రేగుల రాజు,పెంటా సంపత్,రేగుల రవి,టీ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
