నందిగామలో గౌడ హాస్టల్ భవనం ప్రారంభం
సంగారెడ్డి, వెలుతురు, అక్టోబర్ 16 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో గౌడ హాస్టల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. గౌడ హాస్టల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
