ప్రమాద బాధితుడికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మానవతా సహాయం
వికారాబాద్ , వెలుతురు, అక్టోబర్ 19 :
వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం అత్వైల్లి గ్రామ ఉప సర్పంచ్ అమృతమ్మ, సత్తయ్య దంపతుల కుమారుడు కంపల్లి ప్రశాంత్ కుమార్ కు తెలంగాణ శాసనసభ సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ రూ. 2 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించారు. ఈ నెల 10న శనివారం రోజున కొత్తగాడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రశాంత్ కుమార్ తీవ్రంగా గాయపడి, హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వెంటనే స్పీకర్ ప్రసాద్ కుమార్ చలించిపోయారు. బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకొని, మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎల్వోసీ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నా నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను. ప్రశాంత్ కుమార్ కు మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులను కోరాను. అతని కుటుంబానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఆకాంక్షించారు.
ప్రశాంత్ కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు
తమ కుమారుడు ప్రశాంత్ కు అత్యవసర సమయంలో ఆదుకుని, రూ. 2 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్వైల్లి గ్రామ ఉప సర్పంచ్ అమృతమ్మ , సత్తయ్య దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
