హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 21:
హైదరాబాద్ నగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సంజీవయ్య పార్కు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయనే విషయాన్ని వాహనదారులు గమనించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వాహనదారులకు ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. ప్రతి వాహనదారుడు సూచనలు పాటించాలని వారు కోరారు.
