పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం : మహేష్ కుమార్ గౌడ్

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం : మహేష్ కుమార్ గౌడ్

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 20:

 

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘన నివాళులర్పించారు.

 

ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, సమాజంలో శాంతి స్థాపన కోసం పోలీసులు చేస్తున్న సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు.

 

ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం పోలీసులు నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నారని, విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజలకు భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, ధైర్యసాహసాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

 

పోలీస్ అమరవీరుల కుటుంబాల త్యాగాలను సమాజం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, వారి కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది సేవలను గౌరవించాలని పిలుపునిచ్చారు.

 

ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులందరికీ మరోసారి ఘన నివాళులర్పిస్తూ, వారి త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.