అనుముల బ్రదర్స్ ఆస్తులపై విచారణ జరపాలి: మన్నె క్రిశాంక్

అనుముల బ్రదర్స్ ఆస్తులపై విచారణ జరపాలి: మన్నె క్రిశాంక్

అనుముల బ్రదర్స్ ఆస్తులపై విచారణ జరపాలి: మన్నె క్రిశాంక్

హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్లకు నిధుల విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, రాజీవ్ యువ వికాసం పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల పెరుగుదలపై అనేక అనుమానాలు ఉన్నాయని, అనుముల బ్రదర్స్‌కు సంబంధించిన భూములు, కంపెనీలు, పెట్టుబడులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మియాపూర్ భూముల వ్యవహారం, ఆర్‌ఆర్‌ఆర్‌9 వెబ్‌సైట్, ఫైనాన్స్ లావాదేవీలు, డిఫెన్స్ కంపెనీలకు భూముల కేటాయింపుపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. 2022లో అప్పులు తీర్చలేని పరిస్థితి ఉందని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులకు ఇప్పుడు భారీగా ఆస్తులు ఎలా సమకూరాయని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో ప్రస్తావించిన ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై కేవలం ప్రకటనలు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కొండల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ అంశాన్ని ప్రస్తావిస్తూ, మెమరీ లాస్ ఉన్న వ్యక్తి డిఫెన్స్ కంపెనీకి ఎలా అధిపతిగా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నేత బాలరాజు యాదవ్ అరెస్టును అక్రమంగా అభివర్ణిస్తూ ఖండించారు. తాము కోర్టు ఆధారాలతోనే ప్రశ్నలు లేవనెత్తుతున్నామని, తమపై కేసులు, అరెస్టులతో గొంతు నొక్కాలని చూస్తున్నారని క్రిశాంక్ ఆరోపించారు. సోమ్ డిస్టిలరీస్ పరువునష్టం కేసులోనూ బీఆర్‌ఎస్ లీగల్ సెల్ విజయం సాధించిందని పేర్కొన్నారు.

హైదరాబాద్, వెలుతురు , నవంబర్ 07 : రాష్ట్రంలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్లకు నిధుల విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, రాజీవ్ యువ వికాసం పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల పెరుగుదలపై అనేక అనుమానాలు ఉన్నాయని, అనుముల బ్రదర్స్‌కు సంబంధించిన భూములు, కంపెనీలు, పెట్టుబడులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మియాపూర్ భూముల వ్యవహారం, ఆర్‌ఆర్‌ఆర్‌9 వెబ్‌సైట్, ఫైనాన్స్ లావాదేవీలు, డిఫెన్స్ కంపెనీలకు భూముల కేటాయింపుపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. 2022లో అప్పులు తీర్చలేని పరిస్థితి ఉందని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులకు ఇప్పుడు భారీగా ఆస్తులు ఎలా సమకూరాయని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో ప్రస్తావించిన ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై కేవలం ప్రకటనలు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కొండల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ అంశాన్ని ప్రస్తావిస్తూ, మెమరీ లాస్ ఉన్న వ్యక్తి డిఫెన్స్ కంపెనీకి ఎలా అధిపతిగా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నేత బాలరాజు యాదవ్ అరెస్టును అక్రమంగా అభివర్ణిస్తూ ఖండించారు. తాము కోర్టు ఆధారాలతోనే ప్రశ్నలు లేవనెత్తుతున్నామని, తమపై కేసులు, అరెస్టులతో గొంతు నొక్కాలని చూస్తున్నారని క్రిశాంక్ ఆరోపించారు. సోమ్ డిస్టిలరీస్ పరువునష్టం కేసులోనూ బీఆర్‌ఎస్ లీగల్ సెల్ విజయం సాధించిందని పేర్కొన్నారు.