తుఫాన్ ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 17 : తుఫాన్ ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఈ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
