సిద్దిపేటలో బీజేపీ మహాపాదయాత్ర వాయిదా
హైదరాబాద్, వెలుతురు నవంబర్ 24: సిద్దిపేటలో రేపు (నవంబర్ 25) జరగాల్సిన బీజేపీ మహాపాదయాత్ర వాయిదా పడింది. కేంద్ర కేబినెట్ సమావేశం కారణంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన వాయిదా పడినట్లు సమాచారం.
జేపీ నడ్డా పర్యటన వాయిదా పడటంతో మహాపాదయాత్రను కూడా వాయిదా వేస్తున్నట్లు ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు. మహాపాదయాత్ర నిర్వహణకు సంబంధించిన తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.bఈ నేపథ్యంలో ఇప్పటికే ఖరారైన నవంబర్ 25వ తేదీ పాదయాత్రకు సంబంధించి కొత్త తేదీని పార్టీ నాయకత్వం త్వరలో వెల్లడించనుంది.
