మల్లికార్జున్ ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ రావు

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ రావు

న్యూఢిల్లీ వెలుతురు జూన్ 29:
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ మరియు ప్రజాసంబంధాల సలహాదారు హార్కర వేణుగోపాల్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా జీవితంలో 52 సంవత్సరాల విశిష్ట శాసన అనుభవంతో గ్రామస్థాయి నాయకత్వం నుంచి భారత పార్లమెంట్ అత్యున్నత స్థాయికి ఎదిగిన ఖర్గే గారి సేవలు దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల ఖర్గే గారి అంకితభావం దేశ ప్రజలకు ఆదర్శమని పేర్కొన్నారు.

ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.