యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా మన్నె సత్యనారాయణరెడ్డి

యాదాద్రి, హైదరాబాద్‌, జూన్‌ 30 (వెలుతురు)

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని (ట్రస్టు బోర్డు) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబందించిన జీవో నంబర్‌ 392ను ఉత్తర్వులను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ విడుదల చేశారు. వైటీడీ బోర్డుకు ఎమ్​ఎస్​ఎన్​ గ్రూప్(ఫార్మా) ఛైర్మన్​ మన్నె సత్యనారాయణ రెడ్డిని చైర్మన్‌గా నియమితులయ్యారు.

చైర్మన్‌: మన్నె సత్యనారాయణరెడ్డి ( ఎంఎస్ఎన్‌ గ్రూప్‌ చైర్మన్‌)

సభ్యులు! : 
* గడ్డం వినోద్‌ వెంకటస్వామి (బెల్లంపల్లి ఎమ్మెల్యే)
* కొణిదెల సురేఖ (ప్రముఖ నటుడు చిరంజీవి సతీమణి)
* చిల్లప్పగారి విజయ రాజం (విజయక్రాంతి దినపత్రిక చైర్మన్‌ సీ లక్ష్మీరాజం సతీమణి)
* పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌ (ఎల్‌బీ నగర్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు)
* తూళ్ల విజయేందర్‌ (మాజీ హోమ్ మంత్రి దేవేందర్‌గౌడ్‌ కుమారుడు),
* గుండు మల్లయ్య (ఆధ్యాత్మికవేత్త)
* కంఠంనేని స్వాతి (నాట్కో ఫార్మా కంపెనీ)
* ఎం.రాఘవేందర్‌రావు (ఐఏఎస్‌ అధికారి రఘునందన్‌రావు తండ్రి)
* లక్ష్మీనారాయణ నాయక్‌ (జనగామకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు)
* బి నర్సింహమూర్తి (వంశపారంపర్య ధర్మకర్త)

ఎక్స్-అఫీషియో సభ్యులు ! :

* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
* దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్
* యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్
* యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వైటీడీఏ) వైస్‌ ఛైర్మన్
* దేవస్థానం కార్యనిర్వాహక అధికారి (ఈవో)
* స్థానాచార్యులు లేదా సీనియర్‌ ప్రధాన అర్చకుడు

ఎక్స్‌అఫీషియో, వ్యవస్థాపక ట్రస్టీ మినహా మిగతా బోర్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రెండేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఈ ధర్మకర్తల మండలి కొనసాగనుంది.  వీరి పదవీ బాధ్యతలు, ప్రమాణస్వీకారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట దేవస్థాన ఈవోను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.