ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవిస్తూ దేశభక్తి భావనతో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సికింద్రాబాద్ మహంకాళి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ అన్నారు. ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలను గుర్తు చేసేందుకు, దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు జాతీయ జెండాపై గౌరవాన్ని బలపరచడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత, విద్యార్థులు దేశభక్తి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు.

