కాంగ్రెస్ ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ముదిరాజులకు పెద్దపీట..?

ఐదుగురు వరకు చైర్మన్ పదవులు దక్కే అవకాశంపై ఆశాభావం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ సభ్యుడు భీమ లక్ష్మణ్ ముదిరాజ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది

 

హైదరాబాద్ వెలుతురు జూలై 16:

తెలంగాణలో త్వరలో భర్తీ కానున్న నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత ప్రాధాన్యత కల్పించే అవకాశాలపై ఆ వర్గంలో ఆశాభావం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నాలుగు నుంచి ఐదు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ముదిరాజ్ నాయకులకు దక్కే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.

సామాజిక సమతుల్యత, సేవా దృక్పథం, పార్టీ పట్ల అంకితభావాన్ని పరిగణనలోకి తీసుకుంటూ యువ నాయకత్వానికి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ సభ్యుడు భీమ లక్ష్మణ్ ముదిరాజ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకత్వంతో ఎప్పటికప్పుడు సన్నిహితంగా ఉంటూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర, సామాజిక సేవ, ప్రభుత్వ పెద్దలు, పార్టీ అధిష్ఠానంతో ఉన్న సత్సంబంధాలు, అలాగే ముదిరాజ్ సామాజిక వర్గం తరఫున నిరంతరం సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న తీరు వంటి అంశాలు భీమ లక్ష్మణ్ ముదిరాజ్‌కు కీలకమైన చైర్మన్ పదవి దక్కే అవకాశాలను బలపరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నామినేటెడ్ పదవుల భర్తీ ద్వారా సామాజిక న్యాయం, యువ నాయకత్వానికి ప్రోత్సాహం, వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నియామకాలు ఉండనున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.