హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 24:
త్వరలో తెలంగాణ శాసనమండలికి జరగనున్న ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావును జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం ఆ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. 2027 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
డాక్టర్ గడల శ్రీనివాస్ ప్రస్తుతం జనసేన అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ సమన్వయకర్తగా, గతంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులుగా పని చేశాడు. డాక్టర్ గడల శ్రీనివాసరావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించాలనే ప్రతిపాదనను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రాము తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి శంకర్ గౌడ్ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. గడల అభ్యర్థిత్వానికి జనసేన చీఫ్ సుముఖుత వ్యక్తం చేయడంతో ఈ మేరకు పార్టీ అధికారికంగా వెల్లడించింది.
ఈ సందర్బంగా గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినందుకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జికి కృతజ్ఞతలు తెలిపారు.
