ఎంఐఎం పార్టీ నుండి ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌ బహిష్కరణ

హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 29:

ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ఎమ్మెల్సీ మీర్జా రహత్ బేగ్‌పై వేటు వేసింది. ఎమ్మెల్సీ మీర్జా రహత్ బేగ్‌‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎంఐఎం సంయుక్త కార్యదర్శి ఎస్‌.ఎ.హుస్సేన్‌ అన్వర్‌ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆయనను తక్షణమే పార్టీని వదలి వెళ్లాలని ఎంఐఎం అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్‌కు రాజీనామా సమర్పించాలని కూడా మీర్జా రహత్ బేగ్‌‌ను ఎంఐఎం ఆదేశించింది.

మిర్జా రహ్మత్ బేగ్‌‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఎంఐఎం అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంది. ఓ మైనార్‌పై అత్యాచారానికి పాల్పడుతూ రెడ్ హ్యాడెండ్‌గా అతను పట్టుబడినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారమే ఆయనపై చర్యలకు కారణమని ఎంఐఎం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Leave A Reply

Your email address will not be published.