అర్వపల్లిలో మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ

అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామంలో మాజీ మంత్రి, దివంగత నాయకులు కీ.శే. రాజారెడ్డి దామోదర్ రెడ్డి (ఆర్.డి.ఆర్.) విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాంత అభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి ఆర్. దామోదర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజా నాయకుడిగా ప్రజల గుండెల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. దామోదర్ రెడ్డి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, ధరూరీ యోగానంద చారి, పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, దామోదర్ రెడ్డి అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.