వివాహ వేడుకలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కల్వకుంట్ల కవిత ఆత్మీయ పలకరింపు
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 15 : హైదరాబాద్ నాగోల్లోని శుభం కన్వెన్షన్లో ఆదివారం జరిగిన వివాహ వేడుకకు తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. వీరమళ్ళ సత్యం గౌడ్ – విజయలక్ష్మి దంపతుల కుమార్తె లక్ష్మీప్రియ వివాహంలో నూతన వధూవరులు శ్రీదత్త్ గౌడ్ – లక్ష్మీప్రియలను ఆశీర్వదించారు. అనంతరం అక్కడే ఎదురుపడిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను స్పీకర్ ఆత్మీయంగా పలకరించారు. ఇద్దరూ పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, చేతులు జోడించి అభివాదం చేసుకున్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
