విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ ప్రణాళికా లోపాలే కారణం: దేవీప్రసాద్

విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ ప్రణాళికా లోపాలే కారణం: దేవీప్రసాద్


హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 15 :  తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికా లోపాలే కారణమని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సమయానికి సరఫరా చేయడంలో వైఫల్యం చెందిన ప్రభుత్వం, ఉత్పత్తి తగ్గిందనే కారణంతో అధికారులపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. వైటీపీఎస్‌ చీఫ్ ఇంజినీర్ సురేష్‌ను సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. బొగ్గు సరఫరా, సాంకేతిక నిర్వహణ, ప్రభుత్వ ప్రణాళిక, యాజమాన్య పర్యవేక్షణలో లోపాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టేజ్‌-1తో పాటు స్టేజ్‌-2లోనూ పరిస్థితులను పరిశీలించి, బాధ్యత నిర్ణయించడంలో సమాన ప్రమాణాలు పాటించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.