ఉద్యమకారులకు శుభవార్త..
హైదరాబాద్, వెలుతురు అక్టోబర్ 15 : ఉద్యమకారుల గుర్తింపు కోసం సీఎం ప్రజావాణి వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాడ్యూల్ అందుబాటులోకి రాగానే నెలరోజులపాటు మీసేవ, ప్రజావాణి కేంద్రాల ద్వారా ఆధారాలు, కేసుల వివరాలు, సర్టిఫికెట్లతో అప్లై చేయాలి. గడువు ముగిశాక అధికారులు వెరిఫై చేసి లబ్ధిదారుల లిస్ట్ రెడీ చేస్తారు. వీరికి గుర్తింపు కార్డులు, సంక్షేమ పథకాలివ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
