రైతుల విద్యుత్ సమస్యలపై బీజేపీ నిరసన ర్యాలీ

రైతుల విద్యుత్ సమస్యలపై బీజేపీ నిరసన ర్యాలీ

🔹విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రం…

జహీరాబాద్, వెలుతురు, అక్టోబర్ 16:  సంగారెడ్డి జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నిరసన ర్యాలీలో జహీరాబాద్ టౌన్-2 బీజేపీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి బసంతాపూర్ పాల్గొన్నారు. రైతులకు ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పిలుపు మేరకు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవ లక్ష్మయ్య సూచనలతో, జిల్లా అధ్యక్షుడు గోదారి అంజిరెడ్డి అధ్యక్షతన, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో జహీరాబాద్ టౌన్ బీజేపీ ఉపాధ్యక్షుడు గొల్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి నౌబాద్ జగన్నాథ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.