ప్ర‌జా ప్ర‌భుత్వం స‌ల‌హాలు సూచ‌న‌లు రైతులు పాటించాలి

ప్ర‌జా ప్ర‌భుత్వం స‌ల‌హాలు సూచ‌న‌లు రైతులు పాటించాలి

వికారాబాద్, వెలుతురు, అక్టోబర్ 16 :

 

భార‌త్ తో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రకృతి విప‌త్తు ఎల్‌నినో ను ప్ర‌జ‌లంద‌రం క‌లిసి ఎదుర్కొవాల‌ని తెలంగాణ శాస‌న‌స‌భ స‌భాప‌తి, వికారాబాద్ శాస‌న స‌భ్యులు గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ గారు పిలుపునిచ్చారు. వికారాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను స్పీక‌ర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ గడ్డం అనన్య గారు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎల్ నినో విప‌త్తు, దాని ప్ర‌భావంపై స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ గారు మాట్లాడారు. ఎల్ నినో ప్ర‌భావం దాదాపు 100 దేశాల్లో ఉందని, ఇదోక ప్రకృతి విపత్తు అని చెప్పారు. ప్రజలు, రైతులు ప్ర‌జా ప్ర‌భుత్వం, వ్య‌వ‌సాయ శాఖ అధికారుల స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తూ ముందుకెళ్లాల‌ని కోరారు. రైతుల‌కు ప్ర‌జా ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. సాగుకు నీటిని పొదుపుగా వినియోగించుకుందామ‌న్నారు. ఎల్‌నినోను ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు అండగా నిలబడాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జ‌లంద‌రూ ప్రకృతి విపత్తును కలిసికట్టుగా నిలబడి ఎదుర్కోవాల‌ని తెలిపారు.

రాష్ట్ర‌ ఆర్ధిక ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ప్ర‌జా ప్ర‌భుత్వం అన్ని సంక్షేమ ప‌థ‌కాలు, అన్ని అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌ని చెప్పారు. వికారాబాద్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు వికారాబాద్ ప‌ట్ట‌ణం త‌మ హ‌యంలో వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని అన్నారు. హైద‌రాబాద్ లోని ట్యాంక్ బండ్ త‌ర‌హాలో వికారాబాద్ టౌన్ లో శివసాగర్ చెరువును సుంద‌రీక‌ర‌ణ చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.