బెంగళూరులో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రోడ్‌షో

బెంగళూరులో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రోడ్‌షో

బెంగళూరు, వెలుతురు, అక్టోబర్ 15

బెంగళూరులో నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 రోడ్‌షోలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని కర్ణాటక పారిశ్రామికవేత్తలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఒకే విలువ ఆధారిత గొలుసులో రెండు భాగాలని ఆయన పేర్కొన్నారు. ఏరోస్పేస్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, టెక్స్‌టైల్స్ రంగాల్లో పరస్పర భాగస్వామ్యాలకు ప్రతిపాదనలు చేశారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంలో భాగంగా 2034 నాటికి లక్ష కోట్ల డాలర్లు, 2047 నాటికి మూడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం లక్ష్యమని మంత్రి వివరించారు.

Leave A Reply

Your email address will not be published.