శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ వద్దిరాజు
తిరుమల, వెలుతురు, అక్టోబర్ 17
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శనివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు.కలియుగ ఇష్ట దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంగా ఎంపీ రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగుల గంగాభవాని తదితర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర భక్తిప్రపత్తులతో స్వామి వారికి తలనీలాలు సమర్పించి తన మొక్కు చెల్లించుకున్నారు.స్వామి వారిని దర్శించుకునేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన ఎంపీ రవిచంద్రకు వేద పండితులు సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు, ఆశీర్వచనాలు పలికారు.ఎంపీ రవిచంద్రతో పాటు కుటుంబ సభ్యులు వద్దిరాజు ధీరజ్,వద్దిరాజు ప్రీతమ్,వద్దిరాజు గిరినందన్,జంగిలి రీశ్వన్త్ రెడ్డి, గంగుల సనవ్,గంగుల సౌరవ్ లు శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలి,నిండూనూరేళ్లు వర్థిల్లాలి: ఎంపీ వద్దిరాజు
తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి కరువు కాటకాలు నశించాలని,రాష్ట్రం,ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కలియుగ ఇష్ట దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తిరిగి ముఖ్యమంత్రి కావాలని, ఆయురారోగ్యాలతో నిండూనూరేళ్లు వర్థిల్లాలని స్వామి వారిని ఎంపీ రవిచంద్ర ప్రార్థించారు.
