కరెన్సీ అలంకరణలో మహాలక్ష్మీ అమ్మవారి దర్శనం

కరెన్సీ అలంకరణలో మహాలక్ష్మీ అమ్మవారి దర్శనం

 

కరీంనగర్‌, వెలుతురు, అక్టోబర్ 17:  నవరాత్రోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం కరీంనగర్‌లోని శ్రీ మహాదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు కాలరాత్రి అవతారంలో రూపాయల (కరెన్సీ) అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి నిజ పాద దర్శనం కల్పించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. ఇదే సందర్భంగా శ్రీ మహాసరస్వతి అమ్మవారిని సైతం ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

Leave A Reply

Your email address will not be published.