అమితాబ్ బచ్చన్ నివాసం, దిల్జిత్ కచేరీకి బెదిరింపులు

అమితాబ్ బచ్చన్ నివాసం, దిల్జిత్ కచేరీకి బెదిరింపులు

 

ముంబై, వెలుతురు, అక్టోబర్ 23 :

 

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జిత్ దొసాంజ్‌ల‌ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన ఓ బెదిరింపు ఈమెయిల్ ముంబైలో తీవ్ర కలకలం రేపింది. అమితాబ్ నివాసంపై గ్రెనేడ్ దాడికి, దిల్జిత్ సంగీత కచేరీలో ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ ఆగంతకులు హెచ్చరించడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.

 

‘బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్’ (బీఎంసీ) కార్యాలయంతో పాటు ముంబై మేయర్ రీతూ తవ్డే కార్యాలయానికి ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. స్మిత్ జాన్సన్ అనే పేరుతో పంపిన ఈ మెయిల్‌కు ఖలిస్థాన్ అనే పదాన్ని సబ్జెక్టుగా పెట్టారు. ఇందులో జుహూలోని అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’పై గ్రెనేడ్లతో దాడి చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా నవంబర్ 27న మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో జరగనున్న దిల్జిత్ సంగీత కచేరీలో ఆత్మాహుతి దాడికి పాల్పడతామని హెచ్చరించారు. ఈ రెండు ప్రదేశాలతో పాటు కొన్ని పాఠశాలలు, మేయర్ కార్యాలయాన్ని కూడా టార్గెట్ చేస్తామని ఆ మెయిల్‌లో ఉంది.

Leave A Reply

Your email address will not be published.