మహిళా బిల్లును ఎవ్వరూ అడ్డుకోలేరు : మోదీ 

మహిళా బిల్లును ఎవ్వరూ అడ్డుకోలేరు : మోదీ

 

న్యూఢిల్లీ, వెలుతురు, నవంబర్ 28 :  చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహిళల రిజర్వేషన్‌కు సంబంధించి దశాబ్దాలుగా పోరాటం జరుగుతోందన్నారు. ఆ పోరాటంలో తానూ ఒకడినన్నారు. వారి హక్కుల విషయంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తామని వెల్లడించారు. నారీ శక్తి కోసం తమ ప్రభుత్వం వాగ్దానం చేసిందని, హామీ నిలబెట్టుకుంటామని తెలిపారు. డీలిమిటేషన్‌-మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఈనెల 30న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని స్పందించారు. మహిళలకు రిజర్వేషన్లను తమ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని, దీనిని ఏ పార్టీలు అడ్డుకోలేవని స్పష్టం చేశారు.