డీలిమిటేషన్ బిల్లుకు స్టాలిన్ మద్దతు.. కానీ షరతు
చెన్నై, వెలుతురు, నవంబర్ 28 : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అధ్యక్షతన శనివారం చెన్నైలో జరిగిన ఎంపీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం లోక్సభ ప్రాతినిధ్యం తగ్గకుండా చూడటంతో పాటు, 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలన్న డిమాండ్లకు బిల్లులో చోటు లభించిందని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని తమిళనాడు హక్కుల పరిరక్షణలో విజయంగా అభివర్ణించారు.
