ఎల్‌నినో, కరువు పరిస్థితులపై అఖిలపక్ష భేటీ ప్రారంభం
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 28 : రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ఆరో అంతస్తులో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
సమావేశానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు.
వర్షపాతం లోటు నేపథ్యంలో ప్రజలు, రైతులపై ప్రభావాన్ని తగ్గించేందుకు తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగుకు విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. కరువు నివారణకు అవసరమైన ముందస్తు చర్యలపై అఖిలపక్ష నేతల సూచనలను మంత్రుల బృందం స్వీకరించనుంది.
